ఫిట్‌నెస్ గోల్స్.. మహేశ్ బాక్స్ జంప్స్!
on Jan 20, 2021
హ్యాండ్సమ్‌నెస్, ఫిట్‌నెస్ రెండూ ఉండే ఫిల్మ్ స్టార్స్ తక్కువ మందే ఉంటారు. వారిలో ముందు వరుసలో ఉండే నటుడు మహేశ్. రోజు రోజుకూ మహేశ్ యంగ్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటాడని ఇటీవలే మంచు విష్ణు కామెంట్ చేసిన విషయం చూశాం. తెరపై తన బాడీని ఎక్స్‌పోజ్ చేయకపోయినా, అతని ఫిట్‌నెస్ ఎలా ఉంటుందో అతని ఫిజిక్ తెలియజేస్తూనే ఉంటుంది. ఫిట్‌నెస్ గోల్స్ విషయంలో మహేశ్ పడే కష్టం ఎలా ఉంటుందో అప్పుడప్పుడూ అతని భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసే వీడియోలు, ఫొటోలు ద్వారా తెలియజేస్తుంటారు.
లేటెస్ట్‌గా మహేశ్ స్వయంగా తన సొంత జిమ్‌లో చేస్తున్న ఓ వర్కవుట్ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. అందులో అతను బాక్స్ జంప్ చేస్తూ కనిపిస్తున్నాడు. దానితో పాటు, "Raise your game! Accept no limits. Be unstoppable!" అంటూ క్యాప్షన్ పెట్టాడు. #BoxJumps #FitnessGoals అనే హ్యష్‌ట్యాగ్స్‌ను జోడించాడు. తన ఫిట్‌నెస్ ట్రైనర్ మనీష్ గ్రాబ్రియేల్ ఆధ్వర్యంలో ఈ వర్కవుట్ చేస్తున్నట్లు తెలియజేశాడు.
తొమ్మిది గంటల్లోనే ఈ పోస్ట్‌కు నాలుగు లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. ఫిట్‌నెస్ విషయంలో తన ఫ్యాన్స్‌కు ఓ రోల్ మోడల్‌గా ఉంటున్నాడు మహేశ్. అందుకే అతనిపై వారు ఆరాధనాపూర్వకంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మహేశ్ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్‌లో 'సర్కారు వారి పాట' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో అతని జోడీగా జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్ నటిస్తోంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
