మహేశ్ గ్యారేజ్‌లో సరికొత్త లగ్జరియస్ కారవాన్!
on Mar 6, 2021
మన స్టార్లందరికీ సొంత కారవాన్లు ఉన్నాయి. షూటింగ్ లొకేషన్లలో వాటిని వారు ఉపయోగిస్తుంటారు. షాట్ గ్యాప్‌లో సేద తీరాలన్నా, రిఫ్రెష్ అవ్వాలన్నా, మేకప్ వేసుకోవాలన్నా.. కారవానే వారికి ఆధారం. అత్యంత ఆధునిక సౌకర్యాలున్న కారవాన్లను ఉపయోగించడంలో సూపర్‌స్టార్ మహేశ్ ముందుంటాడు. లేటెస్ట్గా ఆయన తన కారవాన్‌ను మార్చారు.
ఇప్పటిదాకా ఆయన వాడిన కారవాన్‌ను చూసిన వాళ్లంతా అబ్బ.. ఎంత బాగుంది! అని ఆశ్చర్యపోయిన వాళ్లే. ఇప్పుడు దానికి మించిన సౌకర్యాలున్న సరికొత్త కారవాన్‌ను మహేశ్ కొనుగోలు చేశారు. పాత కారవాన్ స్థానంలో దీన్ని ఉపయోగించనున్నారు. ముంబైకి చెందిన ఓ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ఈ కారవాన్ లోపలి సౌకర్యాల్ని డిజైన్ చేసినట్లు సమాచారం. దీని కోసం మహేశ్ భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు.
మార్చి 16 నుంచి మహేశ్ 'సర్కారు వారి పాట' కొత్త షెడ్యూల్లో పాల్గొనబోతున్నారు. ఇకనుంచీ అక్కడి లొకేషన్లో ఈ లగ్జరియస్ కారవాన్ దర్శనం ఇవ్వనుంది.