ఆమెకు.. సెక్సీ ఇమేజ్ కావాలట...!
on Aug 29, 2015
గ్లామర్ పాత్రలు చేయాలంటే కథానాయికలకు ఎంతిష్టమో..?! ఆర్ట్ సినిమాలూ, ఆఫ్ బీట్ సినిమాలూ చేస్తే అవార్డులొస్తాయేమో, కానీ... గ్లామర్ పాత్రలతోకే క్రేజ్ వస్తుంది. ఈ నిజాన్ని మనసారా నమ్ముతోంది లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో గుర్తింపు తెచ్చుకొంది లావణ్య. అయితే ఆ తరవాత సరైన సినిమా పడలేదు.
ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాల్ని చేతిలో పెట్టుకొంది. ఓ వైపు నానితో మరోవైపు నాగార్జునతో కలసి నటిస్తోంది. ఇవి కాక మరో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. తనని కేవలం పెర్‌ఫార్మర్‌గానే చూడొద్దని, తనలోనూ గ్లామర్ ఉందని అంటోంది లావణ్య. నిజంగా కథనాయికల్లో ఇదో డిఫరెంట్ స్టేట్ మెంట్. తమని గ్లామర్ పాత్రలకే పరిమితం చేయొద్దని, నటించే ఛాన్సూ ఇవ్వమని కథానాయికలు అంటుంటారు. కానీ లావణ్య మాత్రం రివర్స్ గేర్ వేసింది.
తనకు గ్లామర్ ఇమేజ్ కావాలంటోంది. అలాంటి పాత్రలు చేయడానికి సిద్ధమే అంటూ పచ్చజెండా ఊపేసింది. భలేభలేమగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయినా సినిమాల్లో తనకు గ్లామర్ పండించే అవకాశం వచ్చిందట. ఈ సినిమాలతో తన ఫేట్ మారబోతోందని, తనని ఇక గ్లామర్ కథానాయికగా గుర్తిస్తారని చెబుతోంది లావణ్య. ఇదేం చిత్రమో, ఏమిటో..?

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
