హాస్పిటల్లో చేరిన కత్రినా కైఫ్..!
on Jun 1, 2016
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ హాస్పిటల్ కు వెళ్లింది. కేవలం తన మేనేజర్, ఫిమేల్ స్టాఫ్ తో ఆమె హాస్పిటల్ కు హాజరవడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోయిన్ ఉన్నట్టుండి హాస్పిటల్ కు ఎందుకు వెళ్లిందా అంటూ ఆరాలు తీస్తున్నారు జనాలు. తన మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ తో జగ్గాజాసూస్ అనే సినిమా కోసం మొరాకో వెళ్లింది కత్తి. అయితే అక్కడ నుంచి ఇండియా రాగానే సరాసరి హాస్పిటల్ కు వెళ్లడం వలనే ఈ టాపిక్ కు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది. వీళ్లిద్దరికీ అసలు పడట్లేదన్న సంగతి తెలిసిందే. ఏదో సినిమా ఒప్పుకున్నారు కాబట్టి తప్పక బలవంతంగా మూవీలో నటిస్తున్నారట. మొరాకోలో కత్రినా, రణ్ బీర్ లు భారీ గొడవ పడ్డారని, దీంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని, అందుకే రాగానే ఆమెను మ్యానేజర్ హాస్పిటల్ కు తీసుకెళ్లాడని గుసగుసలాడుతున్నారు బీ టౌన్ పీపుల్. అయితే ఆమె మ్యానేజర్ మాత్రం పుకార్లను ఖండిస్తున్నాడు. వరస షూటింగ్ లతో, రెస్ట్ లేకుండా పనిచేయడం వల్ల ఆమెకు కొద్దిగా ఆరోగ్యం పాడైందని, అందుకే హాస్పటల్ కు వచ్చారని చెబుతున్నాడు. నిజానిజాలు పెరుమాళ్లకెరుక.