'కార్తికేయ'కి కాసుల వర్షం
on Nov 12, 2014
స్వామి రారా వంటి డిఫరెంట్ మూవీతో హిట్‌ని అందుకున్న నిఖిల్ మళ్లీ అలాంటి ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో చేసిన సినిమా 'కార్తికేయ' తనకు సూపర్ సక్సెస్ ఇచ్చిందంటున్నాడు. ఈ చిత్రం రిలీజ్ అయి రేపటికి 20 రోజులు కంప్లీట్ అవుతుంది. 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ఈ చిత్రాన్ని విడుదల చేసిన ప్రముఖ నిర్మాత శివకుమార్ చెబుతున్నారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బొగ్గరం వెంకట శ్రీనివాస్‌లతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 'చిన్న సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేయవనే టాక్ వుంది. దాన్ని బ్రేక్ చేస్తూ మా 'కార్తికేయ' ఒక మంచి కమర్షియల్ సినిమాగా భారీ ఓపెనింగ్స్‌తో ఇప్పటికీ 150 థియేటర్లలో రన్ అవుతోందంటే మామూలు విషయం కాదు.. మంచి సినిమా ఎవరు చేసినా సూపర్‌హిట్ చేస్తామని ప్రేక్ష కులు మరోసారి ప్రూవ్ చేశారని నిఖిల్ అన్నారు.
'ఒక మంచి సినిమా చేశాం. దానికి మంచి డిస్ట్రిబ్యూ టర్ కావాలి. మేం కోరుకున్న మంచి డిస్ట్రిబ్యూటర్‌గా శివకుమార్‌గారు మాకు ఎంతో హెల్ప్ చేశారు. సినిమాని వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకొని పెద్ద హిట్ చేశారని' నిర్మాత బొగ్గరం వెంకట శ్రీనివాస్ అన్నారు. 'కార్తికేయ ఇంత మంచి విజయం సాధించిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ టీమ్ ఎఫర్ట్ అని, ఈ సినిమా సక్సెస్ చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆ క్రెడిట్ దక్కుతుందని' దర్శకుడు చందు మొండేటి అన్నారు.