ప్రెగ్నెంట్ పుకార్లపై స్పందించిన కరీనా కపూర్..!
on Jun 10, 2016
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ త్వరలోనే తల్లి కాబోతోందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ఆమెకు ఇప్పుడు మూడో నెల అని, విశ్రాంతి తీసుకునేందుకు లండన్ వెళ్లిందంటూ వచ్చిన పుకార్లపై కరీనా క్లారిటీ ఇచ్చింది. మహిళకు తల్లి కావడమన్నది ఓ వరం. ఈ విషయంపై ఇప్పటికైతే నేను చెప్పగలిగింది ఇదే. నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్ కాదు. కానీ ఆ ఊహ మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అంటూ తనపై వస్తున్న రూమర్లకు చెక్క పెట్టింది బెబో. కరీనా తన సహనటుడు సైఫ్ అలీఖాన్ ను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రేపో మాపో ఆమె తల్లికాబోతోందంటూ బాలీవుడ్ మీడియా చాలా కాలంగా కోడై కూస్తున్నా, వీళ్లిద్దరూ కొన్ని రోజులుగా లండన్ లో కనిపిస్తుండటంతో కరీనా విశ్రాంతి కోసమే సైఫ్ అక్కడకు తీసుకెళ్లాడనే వార్తలు ఇప్పుడు ఎక్కువ అయ్యాయి. అయితే ఆమె క్లారిటీ ఇచ్చేడయంతో ప్రస్తుతానికి వీటికి ఫుల్ స్టాప్ పడినట్టే.