కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు
on Nov 3, 2015
ప్రస్తుతం అవార్డుల వాపస్ కార్యక్రమం తీవ్రంగా సాగుతోంది. కళాకారులు, రాజకీయవేత్తలు, రచయితలు తమకొచ్చిన అవార్డుల్ని ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తూ.. తమ నిరసనని తెలియచేస్తున్నారు. దీనిపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''అవార్డులు తిరిగి ఇచ్చేయడం తేలికైన విషయమే. క్యాష్ ప్రైజ్ లు ఇవ్వరెందుకు?'' అని సెటైర్లు వేస్తున్నాడు. ''ప్రభుత్వం ప్రేమతో ఇచ్చిన అవార్డులు అవి. ప్రతిభావంతులకు ఆ రూపంలో సత్కరించుకొంది ప్రభుత్వం. వాటిని వెనక్కి తిరిగిచ్చేయడం భావ్యం కాదని నా అభిప్రాయం'' అంటూ క్లియర్ కట్‌గా చెప్పేశాడు.
అంతే కాదు.. ''పరిశ్రమపై నిరసన తెలియజేయాలంటే వచ్చిన అవార్డుల్నే కాదు. ఇక్కడ సంపాదించుకొన్న ఆస్తుల్నీ తిరిగి ఇచ్చేయాలి. అది కష్టం కదా..'' అంటూ మరో కౌంటరేశాడు. అంటే అవార్డుల్ని తిరిగి ఇచ్చేయడంపై కమల్‌కి అంతగా ఆసక్తి లేదన్న విషయం అర్థమవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లెక్కలేనన్ని అవార్డులు అందుకొన్న కమల్ హాసనే ఇలా స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదంటూ, కళాకారుడికి పార్టీ లేదంటూ.. తనపై నెగిటీవ్ ఇంప్రెషన్ పడకుండా జాగ్రత్త పడుతున్నాడు కమల్. మరి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాలి.