'కాయ్ రాజా కాయ్' మూవీ రివ్యూ
on Apr 24, 2015
చిత్రం : కాయ్ రాజా కాయ్
నిర్మాణం : పుల్ మూన్ ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు : రామ్ ఖన్నా, మానస్, జోష్ రవి, శ్రావ్య, షామిలి, హరి, డి.యం.కె, రాఘవ, టార్జాన్, రోజా తదితరులు
సినిమాటోగ్రఫీ : దేవ్
ఎడిటింగ్ : ఉద్ధవ్ ఎస్.బి
సంగీతం : జె.బి
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : శ్రీనివాస్ అడ్డాల
నిర్మాత : సతీష్ రాజు వేగేశ్న
రచన, దర్శకత్వం : శివగణేష్
విడుదల : 23.4.2015
రేటింగ్ : 2.5 / 5
మారుతి టాకీస్ సమర్పణలో ఫుల్‌మూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా ‘కాయ్ రాజా కాయ్’. రామ్ ఖన్నా, మానస్, షామిలి, శ్రావ్యలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ద్వారా శివ గణేశ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. క్రైమ్ కామెడీ గా తెరకెక్కిన ఈ మూవీ గురువారం విడుదలైంది. ఈ మధ్య వస్తున్న సినిమాలన్ని క్రైమ్ లేదా కామెడీని బేస్ చేసుకొనే వస్తున్నాయి.. మరి ఈ రెండింటి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం...
కథ :
ఈ సినిమా ముగ్గురు యువకులది, భట్టూ అనే గ్యాంగ్‌స్టర్ తో కలిసి నడిచే చిత్రం. బంగారం వ్యాపారిని చంపేసి అతడి వద్దనున్న ఓ బంగారం పెట్టెను కొందరు దుండగులు దోచుకెళతారు. ఆ పెట్టెను ఓ కార్లో పెట్టి ఆ కారును పాడుబడిన గ్యారేజీలో పడేసి వెళ్ళిపోతారు. ఇదే బంగారం పెట్టె కోసం భట్టూ అనే గ్యాంగ్‌స్టర్ తన వాళ్ళతో వెతుకుతూ ఉంటాడు. బంగారాన్ని దొంగతనం చేసిన వారిని పట్టుకొని చివరకు బంగారాన్ని సొంతం చేసుకుంటాడు. ఆనంద్(మానస్), కన్నా(రామ్ ఖన్నా), చిట్టీ(జోష్ రవి) . ఆనంద్ ఓ చిన్న ఉద్యోగం సంపాదించాలనే క్రమంలో కష్టపడుతుండగా, కన్నా ఓ చిన్న మెకానిక్ షాపులో పనిచేస్తుండాడు. చిట్టీ వీరిద్దరికి భిన్నంగా కిడ్నాప్, స్మగ్లింగ్ లాంటివి చేసి డబ్బులు సంపాదించాలన్న ఆలోచనలో ఉంటాడు. కన్నా ఎంతగానో ప్రేమించే అమ్మాయి అతణ్ణి మోసం చేసి వెళ్ళిపోవడం, ఒక అమ్మాయి వల్ల ఆనంద్ ఉద్యోగం ఊడిపోవడం జరిగిపోతుంది. ఆ ముగ్గురు కలిసి ఓ కిడ్నాప్ ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్ లో కార్ లో ఉన్న బంగారం పెట్టె ఈ ముగ్గురి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భట్టూ వీరి కోసం వెతకడం, వీళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయి (ఆనంద్ గర్ల్‌ఫ్రెండ్) కోసం కొందరు వెతకడం.. ఇలా నడుస్తుంది కథ. ఆ తర్వాత ఏమైంది? బంగారం పెట్టె గురించి భట్టూకి మాత్రమే తెలిసిన విషయమేంటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ :
దర్శకత్వం విషయానికి వస్తే శివగణేష్ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. డైరెక్టర్ గా తొలి సినిమా అయినా టేకింగ్ లో అలాంటి ఫీలింగ్ కలగనివ్వలేదు. స్టార్టింగ్ లోనే స్టోరీని స్ట్రెయిట్ గా చెప్పేందుకు ట్రై చేసిన గణేష్. పాత్రలను ఎస్టాబ్లీష్ చేసేందుకు ఎక్కువ టైమ్ తీసుకున్నాడు.. అలాగే కొన్ని సన్నివేశాలు ముందుగానే ఊహించే విధంగా ఉన్నాయి. జేబీ అందించిన మ్యూజిక్ జస్ట్ యావరేజ్. ఆడియన్స్ ని కూర్చోబెట్టడంలో మ్యూజిక్ పెద్దగా హెల్ప్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యింది. ఇంకాస్త టఫ్ గా ఉండే ఎడిటింగ్ ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొదటి 15 నిమిషాల్లో చూపిన కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ, కథని చెప్పడం మొదలు పెట్టిన విధానం ఆడియన్స్ ని కట్టి పడేస్తుంది. ఎప్పుడైతే విలన్ పాత్ర ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి ఒక్కసారిగా ఫ్లో కింద పడి అక్కడి నుంచి ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతుంటుంది. మొదటి 20 నిమిషాల తర్వాత కథ మొత్తం బాగా ఊహాజనితంగా మారిపోవడమే కాకుండా బోరింగ్ గా తయారవుతుంది. మొదటి 15 నిమిషాల్లో కనపడిన సీన్స్ లాంటివి మళ్ళీ ఒకటి కూడా కనిపించదు. సీన్స్ అన్నీ సాగదీసేసారు. ముఖ్యంగా సెకండాఫ్ లో బాగా సాగదీసిన సీన్స్ చాలా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్‌గా చెప్పాల్సి వస్తే ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ కోరుకున్న పెర్‌ఫార్మెన్స్‌ని ఇచ్చారని సినిమా చూస్తే అర్థమవుతుంది. మానస్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా తన పాత్ర పరిచయ సన్నివేశాల్లో మరియు కొన్ని సన్నివేశాల్లో మాస్ ఆడియన్స్ ని బాగా మెప్పించాడు. ఒక నిరుద్యోగిగా మానస్ చేసిన క్యారెక్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. మానస్ పెర్‌ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా ఇంతకుముందు సినిమాల కంటే మెచ్యూర్డ్‌గా చేసాడని చెప్పాలి. డైలాగ్స్ కూడా వెరైటీగా చెప్పే ప్రయత్నం చేశాడు. డ్యూయెట్ సాంగ్‌లో మానస్ వేసిన నైస్ స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఒక బిటెక్ అమ్మాయిని ప్రేమించే లవర్‌గా మంచి నటనను ప్రదర్శించాడు రామ్‌ఖన్నా. రామ్‌ఖన్నా, మానస్, జోష్ రవి తమతమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు.
ఇక అల్లరి చేసే చిట్టిబాబు క్యారెక్టర్‌లో జోష్ రవి మొదట్లో కాస్త అతిగా అనిపించినా పోను పోను అతని క్యారెక్టర్ కూడా బాగుందనిపిస్తుంది. తన కామెడీతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. డి.యం.కె. కనిపించేది కొన్ని సీన్స్‌లోనే అయినా కనిపించిన ప్రతిసారీ నవ్వించే ప్రయత్నం చేశాడు. విలన్‌గా నటించిన హరికృష్ణ పెర్‌ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. చాలా సీన్స్‌లో క్రూయల్‌గా కనిపిస్తూ ఆడియన్స్‌కి తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు.
మైనస్ పాయింట్స్ :
క్రైమ్ కామెడీ అనే నేపథ్యం ఆకట్టుకునేదే అయినా కథ మాత్రం గతంలో ఎన్నో సినిమాల్లో చూసి ఉన్న కథలానే ఉంది అంతగా ఆకట్టుకోదు. సినిమాలో అనవసరంగా వచ్చే రిపీటెడ్ సన్నివేశాలు, సినిమా ను బోర్ కొట్టిస్తాయి. అనవసరంగా పాటలు వస్తుంటాయి. సినిమా కథ మొదలైన కొద్దిసేపటికే క్లైమాక్స్‌ను ఊహించే విధంగా ఉంటుంది కాబట్టి పెద్ద త్రిల్ ఏమి ఉండదు. అక్కడక్కడా విలన్ పాత్ర ఓ అర్థం పర్థం లేని క్యారక్టార్. కథ, కథనాల్లో పెద్దగా కొత్తదనమేమీ లేదు. ఎడిటర్ కొన్ని సన్నివేశాల విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది. పాత చింతకాయ పచ్చడి కథను తీసుకుని లాగించేశాడు. కథనంలోనూ ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో సినిమా మీద స్టార్టింగ్ నుంచే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ అనిపించదు. రొటీన్ డైలాగ్స్, రొటీన్ సీన్స్‌తో తర్వాత ఏం జరగబోతోంది అనేది కూడా మనకి ముందే తెలిసిపోతూ వుంటుంది. లెంగ్తీ రన్‌టైమ్ సినిమాకు మైనస్ పాయింట్స్.
ఫైనల్ గా చెప్పాలంటే...
కథలో కొత్తదనం లేకపోయినా అక్కడక్కడా నవ్వుకునే నాలుగు సీన్లు, సన్నివేశాలు ఊహించదగ్గదే అయినా ఈ సినిమాను ఓసారి చూడొచ్చు

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
