ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్ .. "అన్నా .. మాది రాయల సీమ"
on May 23, 2018
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో 'అరవింద సమేత వీర రాఘవ' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేశారు. ఇక సిక్స్ ప్యాక్ తో ఉన్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అందరికీ తెగ నచ్చేసింది. ఫస్ట్ లుక్ అంటే ఏదో నార్మ్లల్ లుక్ లో ఉంటుందని అనుకున్నారు...కానీ ఏకంగా సిక్స్ ప్యాక్ తో ఉన్నలుక్ ను విడుదల చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు దానికి తోడు ఆ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ చెప్పే ఓ డైలాగ్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుందన్న విషయం తెలుసు. దీనిలో భాగంగానే ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడతాడట. " అన్నా .. మాది రాయల సీమ .. నమ్మితే ప్రాణాలు ఇస్తాం .. నమ్మక ద్రోహం చేస్తే ప్రాణాలు తీస్తాం" అంటూ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో.. మరో కథానాయికగా ఈషా రెబ్బా కనిపించనుంది.