బాహుబలి కంటే ఎక్కువే.. ఐయామ్ హ్యాపీ.. ఎన్టీఆర్
on Oct 28, 2015
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా టీజర్ విడుదలై రికార్డులు బద్దలుకొడుతుంది. ఈ టీజర్ విడుదలైన కొద్ది రోజులకే 20 లక్షల వ్యూస్.. 39వేల లైక్స్ ను సాధించింది. అయితే అఫీషియల్ ఛానల్ లో రికార్డ్ వ్యూస్ లెక్కలోకి తీసుకుంటే బాహుబలిదే ఫస్ట్ ప్లేస్. ఈ సినిమా టీజర్ 60లక్షల వ్యూస్ తో చాలా దూరంలో ఉండగా వచ్చిన లైక్స్ మాత్రం 36వేలే. అది కూడా చాలా టైం పట్టింది. కానీ నాన్నకు ప్రేమతో సినిమాకి మాత్రం కేవలం 20 లక్షల వ్యూస్ తో 39వేల లైక్స్ వచ్చాయి. ఈ రకంగా లైక్స్ పరంగా చూస్తే బాహుబలి కంటే నాన్నకు ప్రేమతో సినిమాకే ఎక్కువ వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. మానాన్నకు ప్రేమతో సినిమా టీజర్ కు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని.. ఈ టీజర్ కు 20 లక్షల వ్యూస్ 39 వేల లైక్స్ రావడం టీంకే ఉత్సాహం ఇస్తోందని ట్వీటాడు. మరి టీజర్ అయితే అందరికి బానే నచ్చింది.. సినిమా ఏ మేరకు నచ్చుతుందో చూడాలి.
Also Read