లండన్ లో ఎన్టీఆర్ ఫైటింగ్
on Jul 18, 2015
సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రకల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్ర షూటింగ్ లండన్ లో జరుగుతోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన యూనిట్.. తొలి షెడ్యూల్ ను ఓ పాట చిత్రీకరణతో ప్రారంభించారు. డాన్స్ మాస్టర్ రాజుసుందరం నేతృత్వంలో ఎన్టీఆర్, రకుల్ లపై ఆ పాటను చిత్రీకరించారు. ఆ సాంగ్ షూటింగ్ అయిపోయిన వెంటనే యాక్షన్ సీన్లలో ఎన్టీఆర్ బిజీ అయ్యాడు. ఈ చిత్ర యూనిట్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.
లండన్ లో మొదలైన ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 20 వరకూ కంటిన్యూగా జరుగనుంది. ఆ తర్వాత షెడ్యూల్ యూరప్ లో జరుగనుంది. ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
