రాజ్‌తరుణ్ వద్దకు క్యూకడుతున్న అమ్మాయిలు...!
on Sep 29, 2016
రూమర్స్‌కు, సినీ పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. టీవీ ఛానెళ్లు, మ్యాగజైన్లు జనం నోళ్లలో నానాలంటే వాళ్లకు కనిపించే మొదటి దారి రూమర్స్. పలానా హీరోయిన్..హీరోతో క్లోజ్‌గా ఉంటుందనో, ఆ హీరోయిన్, దర్శకుడితో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తుందనో ఇలా 24 విభాగాల్లో ఎవ్వరిని వదలకుండా అందరిపై రూమర్స్ అల్లేస్టుంటారు మీడియా జనాలు. తాజాగా షార్ట్‌ఫిలిం హీరో నుంచి ఫీచర్ ఫిలిం హీరోగా ప్రమోషన్ కొట్టేసిన రాజ్‌తరుణ్‌పై ఈ మధ్య తెగ పుకార్లు వచ్చేస్తున్నాయి. రీసెంట్గా యాంకర్ లాస్యకి, రాజ్‌తరుణ్‌కి లింక్ పెట్టేశారు..అక్కడితో ఆగితే పర్లేదు కానీ వాళ్లిద్దరికీ పెళ్లి కూడా చేసేశారు. దీనిపై స్వయంగా రాజ్‌తరుణ్ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
మా ఇద్దరి మధ్య ఏం లేదని..ఒకే ఒక్క ఆడియో ఫంక్షన్లో కలిసినందుకు మా పెళ్లి చేసేశారని రూమర్స్‌కు చెక్ పెట్టేశాడు. అది అలా ముగిసిందో లేదో వెంటనే మరో గాసిప్ రెడీ అయిపోయింది. షార్ట్‌ఫిలింస్‌లో మనోడికున్న ఎక్స్‌పీరియన్స్‌తో హీరోయిన్స్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలి అనే దానిపై అమ్మాయిలకు సలహాలు ఇస్తున్నాడట. ఇంకేముంది రాజ్‌తరుణ్‌ని కలవడానికి అమ్మాయిలు క్యూలు కట్టేస్తున్నారట. మరి ప్రేమ పెళ్లి విషయంలో వచ్చిన రూమర్స్‌కి సకాలంలో స్పందించి చెక్ పెట్టిన రాజ్‌తరుణ్ ఇప్పుడు వస్తున్న వార్తలకు ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.