హ్యాపీ బర్త్‌డే టూ సోనాక్షి..
on Jun 2, 2016
సోనాక్షి సిన్హా..కలువ లాంటి కళ్లతో..మెస్మరైజింగ్ స్మైల్‌తో యూత్ డ్రీమ్ గాళ్‌గా వెలిగిపోతోంది. బాలీవుడ్ లెజెండ్ శతృఘ్న సిన్హా కుమార్తెగా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన సోనాక్షికి తను వెళ్లేదారి పూలబాట కాదని తెలుసు. ఎందుకంటే ఎంత స్టార్ కిడ్స్ అయినా ప్రేక్షకులను ఆకట్టుకుపోతే ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిందే. కానీ తను అలా కాకుండాదని ఎంతో కష్టపడింది. ముంబైలోని థాకర్సే యూనివర్శిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న టైంలో కండలవీరుడు సల్మాన్‌తో "దబాంగ్"లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
2010లో విడుదలైన దబాంగ్ చిత్రంతో తెరంగేట్రం చేసిన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల కలెక్షన్లతో పాటు ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఆ తరువాత "దబాంగ్-2", "రౌడీ రాథోడ్", "సన్ ఆఫ్ సర్దార్", "హాలిడే" చిత్రాలు వరుసగా సూపర్‌హిట్ అయ్యాయి. అంతేకాదు ఈ చిత్రాలన్ని 100 కోట్లక్లబ్‌లో చేరడంతో మోస్ట్ వాంటేడ్ హీరోయిన్‌గా మారిపోయింది. వీటిలో తన గ్లామర్‌తో మాత్రమే ఆకట్టుకున్న సోనాక్షి 2013లో వచ్చిన "లుటేరా" చిత్రంలో టీబీ వ్యాధిగ్రస్తురాలిగా తన అసమాన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో నటనకు గానూ ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి అనేవారి చేత సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా అనిపించేలా దూసుకుపోతున్న సోనాక్షికి జన్మదిన శుభాకాంక్షలు.