శాతకర్ణి దెబ్బకి ఇద్దరు సిఎంలు దొరికారు
on Jan 16, 2017
నందమూరి బాలకృష్ణ ''గౌతమీపుత్ర శాతకర్ణి'' చిత్రం వివాదంలో పడింది. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర ఆదారంగా ఈ సినిమా తీశామని దర్శకుడు క్రిష్ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలైయింది. ఈ సినిమా చూసిన కొందరు చరిత్రకారులు..గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్రను వక్రీకరించారని, అసలు గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు వాడు కాదని, సినిమాలో చూపించినట్లు అతడు కోటిలింగాల్లో పుట్టలేదని, అతడి మూలాలు మహారాష్ట్రకు చెందినవి, కేవలం అమరావతిని కేంద్రంగా చేసుకోని పాలించాడని,సినిమాలో శాతకర్ణి కాలంపై కూడా వివరణ లేదని, గ్రీకు యోదుడు దిమిత్రితో శాతకర్ణి యుద్ధం చేసినట్లు చూపించారని, ఇది సుద్ధ అవాస్తవమని, దిమిత్రి కాలానికి, శాతకర్ణి కాలానికి చాలా వ్యత్యాసం వుందని, చరిత్ర ఆధారంగా తీసామని చెబుతున్న ఈ సినిమా మొత్తం ఫిక్షన్ లా వుందని, ఇలాంటి సినిమాకి తెలుగు ప్రభుత్వాలు పన్నుమినహాయింపులు ఎలా ఇచ్చాయో చెప్పాలని, దీనిపై తాము కోర్టుకు వెళతామని ప్రకటించారు పలువురు తెలుగు చరిత్రకారులు.
చరిత్రకారుల ప్రశ్నల్లో అర్ధం వుందనే చెప్పాలి. ఇలాంటి చిత్రాలు తీసుతున్నప్పుడు ఫిక్షనా, నాన్ ఫిక్షనా చెప్పాలి. క్రిష్ మాత్రం తాను చరిత్రలో వున్నది వున్నట్లుగానే తీశానని చెబుతున్నాడు ఇప్పటివరకూ. అయితే ఆ చరిత్ర ఏమిటో, ఎవరు గ్రంధస్తం చేశారో,దానికి ప్రామాణికం ఏమిటో ఇలాంటి పూర్తి వివరాలు చెప్పాల్సిన ఉటుంది. మరి ఈ వివరాలను దర్శకుడు క్రిష్ వెల్లడిస్తారో లేదో చూడాలి. ఇక ప్రభుత్వాల విషయానికి వద్దాం. ఈ చిత్రానికి పన్నుమినహాయింపు ఇవ్వడంలో పోటి కనబరిచాయి తెలుగు ప్రభుత్వాలు. అసలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఓ కమిటీ వుటుంది. కమిటి సినిమాని చూసి , దాన్ని సమీక్షించి, అసలు వాస్తవం ఏమిటి, చరిత్ర ఏమిటి, రాయితీలు ఇవ్వడానికి అర్హత వుందా? ఇలాంటి అనేక అంశాలు చర్చించాలీ. అయితే అలాంటింది ఏమీ కనిపించలేదు. చిత్ర బృందం వెళ్లి ముఖ్యమంత్రులను కలవడం,వెంటనే వారి నుండి పన్నుమినహాయింపు ప్రకటనలు వచ్చేయడం జరిగిపోయింది.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. గుణశేఖర్ తీసిన కాయతీయ చరిత్రకు ఏపీ నుండి ఎలాంటి సహకారం లభించలేదు. దీనిపై ఈ మధ్యనే దర్శకుడు గుణశేఖర్ ఏపీ సిఎం చంద్రబాబుకు ఓ లెటర్ కూడా రాశాడు, దీనిపై స్పందన లేదు. మరి ఏ ప్రాతిపాదికన ఈ సినిమాకి పన్నుమినహాయింపు ఇవ్వలేకపోయారు చెప్పలేదు. అయితే శాతకర్ణి విషయంలో పోటీపడిమరీ పన్నుమినహాయింపు ఇచ్చేశాయి. ఇప్పుడు ఈ సినిమాపై ఈ విషయంలో వివాదం రేగింది. సమాధానం చెప్పాల్సిన భాత్యత తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పై వుంది. ఈ చిత్రానికి ఎందుకు పన్నుమినహాయింపు ఇచ్చారో, అతంటి గొప్ప చరిత్రకు ఏ ఆధారాలు వున్నాయో, ఎక్కడవున్నాయో.. లేదా సినిమానే ఆధారంగా చేసుకోవాలో.. చెప్పాలి. లేదంటే విమర్శలు తప్పవు. మొత్తంమ్మీద 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పి తెచ్చిపెట్టింది.