గజల్ శ్రీనివాస్, మాధవి లతల"అనుష్టానం" చిత్రం టాకీ పూర్తి
on Jun 29, 2015
లలితశ్రీ మూవీస్ పతాకంపై శ్రీ MP రవిరాజ్ రెడ్డి నిర్మాతగా వట్లూరి జయ ప్రకాష్ నారాయణ సహా నిర్మాతగా డా// గజల్ శ్రీనివాస్, మాధవిలత జంటగా నటిస్తున్న అనుష్టానం టాకీ పార్టు పూర్తయిందని దర్శకుడు కృష్ణ వాసా తెలిపారు.
ఇటివల సారధి స్టుడియోలో నాయకి నాయకులతో యుగళ గీతాన్ని, పతాక సన్నివేశాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరించినట్లు తెలిపారు. భార్య, భర్తల మధ్య ఉండే అనుభందాలను, కొన్ని సున్నితమైన అంశాలను ఈ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయని, 1950 లో శ్రీ గుడిపాటి వెంకటచలం గారు రాసిన ఒక కథ స్పూర్తితో ఈ చిత్రాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. డా. గజల్ శ్రీనివాస్, మాధవిలత పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలుస్తుందని, సీనియర్ నటి జయలలిత, మలయాళ నటుడు శ్రీ డిసౌజా, రాగిణి, సాయి శర్మ, శ్రీనివాస రెడ్డి, కృష్ణ కిషోర్ లు ఈ చిత్రంలో నటించారని తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరామెన్ గ వెంకట హనుమ, ఎడిటింగ్ ఆంజనేయులు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్సకత్వం కృష్ణ వాసా అని, ఈ జూలై నెలలో ఎడిటింగ్, రీరికార్డింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదలకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
