బాబాయ్‌కి ఫ్లాప్ ఇచ్చాడు.. మరి అబ్బాయ్‌కి??
on Apr 29, 2015
సినిమా ఇండ్రస్ట్రీలో ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా తిరుగుతుందో చెప్పలేం. ఫ్లాప్ లో ఉన్నవాళ్లు సడన్‌గా ఓ బంపర్ హిట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. హిట్ బాటలో ఉన్నవాళ్లు అట్టర్ ఫ్లాప్ ఇచ్చి... షాకిస్తారు. ఏ.ఎస్. రవికుమార్ జీవితమూ అంతే. రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రవికుమార్ చౌదరి - యజ్ఞంలాంటి సూపర్ హిట్ తీశాడు. ఆ తరవాత నందమూరి బాలకృష్ణ నుంచి పిలుపు అందుకొంది. ఇక మనోడు టాప్ లిస్టులో చేరిపోవడం ఖాయమనుకొన్నారంతా. కానీ.. వీరభద్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో... కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. నితిన్, తనీష్‌లతో సినిమాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ తరవాత పిల్లా నువ్వు లేని జీవితంతో.. మళ్లీ గాడిన పడ్డాడు. ఇప్పుడు మరో నందమూరి హీరో నుంచి పిలుపు అందుకొన్నాడు. పటాస్ తో జోరుమీదున్నాడు కల్యాణ్ రామ్. ఇప్పుడు రవికుమార్ చెప్పిన కథ ఓకే చేశాడట. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తారని టాక్. మరి బాబాయ్‌కి ఫ్లాప్ ఇచ్చిన ఈ దర్శకుడు.. అబ్బాయికి ఎలాంటి షాక్ ఇస్తాడన్నది నందమూరి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. షేర్ సినిమాతో బిజీగా ఉన్నకల్యాణ్‌రామ్.. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తాడని తెలిసింది.