నయన్ నటనను చీదరించుకున్న ధనుష్!
on Dec 3, 2020
నయనతార అంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్‌స్టార్ అనే పేరు సంపాదించుకున్న నటి. దశాబ్దం పైగా తెలుగు, తమిళ భాషా చిత్ర రంగాలలో.. ప్రత్యేకించి తమిళ చిత్ర రంగంలో తిరుగులేకుండా రాణించిన తార. అలాంటి ఆమెకు కొంత కాలం వరుసగా ఫ్లాపులు వచ్చాయి. ఆ టైమ్‌లో విజయ్ సేతుపతి సరసన చేసిన 'నానుమ్ రౌడీ దాన్' (2015) సినిమాతో ఆమెకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. దాని డైరెక్టర్ విఘ్నేశ్ శివన్. ఆ సినిమాని నిర్మించింది ధనుష్. దాని సెట్స్ మీదే నయన్, విఘ్నేశ్ ప్రేమలో పడ్డారు.
లేటెస్ట్‌గా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో 'నానుమ్ రౌడీ దాన్ మూవీ'లో చేసిన పర్ఫార్మెన్స్‌కు గాను నయన్ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంటోంది. బెస్ట్ యాక్ట్రెస్ ట్రోఫీని అందుకున్నాక మాట్లాడిన నయన్ ఆ సినిమా ప్రొడ్యూసర్ ధనుష్‌కు అపాలజీ చెప్తూ, ఆ సినిమాలో తన పర్ఫార్మెన్స్‌ను ధనుష్ చీదరించుకున్నాడనీ, అతని ప్రశంసలు పొందడానికి ఫ్యూచర్‌లో తన నటనను ఇంప్రూవ్ చేసుకుంటానని ప్రామిస్ చేశాననీ తెలిపింది.
ఆ మాటలు ఆమె సీరియస్‌గా చెప్పిందా, లేక ధనుష్‌ను ఎత్తిపొడవడానికి చెప్పిందా అనే విషయం తెలీదు కానీ, ఆ వీడియో మాత్రం ఆన్‌లైన్‌లో ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతోంది. నయన్‌ను అద్భుత నటి అనీ, ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించగల కరిష్మా ఆమె సొంతమనీ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
