దీపిక సరదా!
on Apr 29, 2015
శాంతిమంత్రం జపిస్తూ అడుగుపెట్టి జెట్ స్పీడ్ తో దూసుకెళ్లిన దీపికా పదుకొనేలో కొత్త కొత్త ఆలోచనలు చిగురిస్తున్నాయట. హీరోయిన్ గా ఇక తిరుగులేదు కాబట్టి....మరో రూట్లో కూడా ట్రై చేస్తే బాగున్ను అనే ఆలోచనలో ఉందట. ఏం చేస్తుందేంటి?బిజినెస్ స్టార్ట్ చేస్తుందా! రియల్ ఎస్టేట్ లో అడుగుపెడుతుందా! అంటారా? ఈ రెండూ కాదుకానీ సినిమాలు నిర్మిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రీసెంట్ గా అనుష్కశర్మ ఎన్ హెచ్ 10తో కొత్తగా ట్రై చేసిందిగా....దీపిక ఆమెను అనుసరిస్తుందా ఏంటి అనే డిస్కషన్ జోరందుకుంది. దేనికైనా వెంటనే స్పందించే పొడుగుకాళ్ల సుందరి అస్సలు ఆ ఆలోచన లేదనే క్లారిటీ ఇచ్చింది. కానీ కెమెరా వెనుక నుంచి మాత్రం పనిచేయాలనుందంది.ఈ ట్విస్టేంటి అమ్మడూ...అంటే....అవకాశం వస్తే లైన్ ప్రొడ్యూ సర్ గా పనిచేస్తా అందట. ఈ లెక్కన దీపిక షాడో నిర్మాతగా ఉంటూ చిత్ర నిర్మాణం చేయాలనే ఆలోచనలో ఉందన్నమాట. దీంతో అయ్యపక్కన నేలైతే ఏంటి? అమ్మ పక్కన కింద అయితే ఏంటి? రెండూ ఒక్కటేగా! అని బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఏదేమైనా భవిష్యత్ లో దీపిక నిర్మాతగా వ్యవహరించడం ఖాయం అంటున్నారు.