యాక్టింగ్‌లో శ్రీదేవిని కాపీకొట్టే సునీల్!
on Jan 25, 2021
అవును. చాలామందికి ఈ విషయం తెలీదు. నటన విషయంలో సునీల్ కాపీ కొట్టేది అక్షరాలా అతిలోకసుందరి శ్రీదేవిని. ఈ విషయం స్వయంగా సునీల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అతను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది విలన్ అవ్వాలని. మోహన్‌బాబులా అక్కడక్కడా కామెడీ చేస్తూ, వయసు పెరిగాక కోట శ్రీనివాసరావులా చేయాలనేది అతడి ఉద్దేశం. "అయితే నేను కాపీ కొట్టేది శ్రీదేవిని. ఆ విషయం ఎవరికీ తెలీదు. కోటగారినీ, శ్రీదేవిగారినీ మిక్స్ చేస్తే సునీల్. శ్రీదేవి వంద సినిమాలు చేసినా ఆమె వ్యక్తిగత అమాయకత్వం ఎందులోనూ మిస్సవదు." అని చెప్పాడు సునీల్.
జనం సినిమా థియేటర్‌కు వచ్చేది వినోదం కోసమే అని అతను నమ్ముతాడు. "అలా కాకుండా ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లి సినిమాలు చూద్దామనుకొనేవాళ్లది ఇంకో తరహా. ఆ ప్రేక్షకులు వేరు, ఈ ప్రేక్షకులు వేరు. టిక్కెట్ కొనుక్కొని థియేటర్‌కు వచ్చేవాళ్లు కోరుకొనేది వినోదమే. అనుకోకుండా నేను కమెడియన్ అయ్యాను. రామ్‌గోపాల్ వర్మ ప్రేమకథ సినిమాలో కామెడీ వేషమివ్వమని అడిగితే, విలన్లా ఉన్నావన్నారాయన. ఇప్పుడు నాకు కమెడియన్ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి, నేనేం చేసినా కామెడీగానే అనిపిస్తుంది." అని చెప్పుకొచ్చాడు సునీల్.