చరణ్ కు నాపై ప్రేమ కాదు... డబ్బు మీద మమకారం...
on Jan 15, 2017
ఖైదీ నెం 150 సినిమా లో చిరంజీవి ఎంత యంగ్ లుక్ తో కనిపించారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన ఎంతో ఫిట్ గా కనిపించారు. అయితే చిరంజీవి ఫిట్ నెస్ పై నాగబాబు కుమార్తె నీహారిక అడిగిన ప్రశ్నకు చిరంజీవి నవ్వుతూ చమత్కారంగా సమాధానం చెప్పారు. చిరంజీవి, రామ్ చరణ్, వీవీ వినాయక్ లను నీహారిక ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో చిరంజీవి ఫిట్ నెస్ గురించి..."డాడీ... నీ ఫిట్ నెస్ మంత్రం ఏంటో చెబితే, నేను కూడా మా నాన్నకు చెప్పి, ఫిట్ చేసుకుంటా" అని అడుగగా దానికి పెద్దగా నవ్వేసిన చిరంజీవి... సురేఖ, రామ్ చరణ్ ఫుడ్, ఎక్సర్ సైజుల గురించి నిత్యమూ పర్యవేక్షిస్తుండే వారని, ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటూ, నిత్యమూ వ్యాయామంతో బరువు తగ్గించుకుంటూ వచ్చానని అన్నారు. అంతేకాదు...ఇదంతా ఆలోచిస్తుంటే... అబ్బా, నా మీద ఎంత ప్రేముంది అనుకునేవాడిని.. కానీ, ప్రేమ కాదు... వాడు సినిమా నిర్మాత.. సో, హీరో బాగుంటేనే కదా, నాలుగు డబ్బులు వస్తాయని, డబ్బు మీద మమకారంతో వీడు నన్ను నానా హింసలూ పెట్టాడు.. ఈ విషయం తరువాత నాకు అర్థమైంది" అన్నారు నవ్వుతూ.