చిరంజీవి పొగడ్తలు.. అప్పుడు తమన్నా..ఇప్పుడు రకుల్
on Oct 3, 2015
మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో ఏ హీరోయిన్ కు మాత్రం పొగిడించుకోవాలని ఉండదు చెప్పండి. అలాంటిది మెగాస్టారే స్వయంగా అంతలా పొగిడేసరికి ఆహీరోయిన్ ఒకపక్క షాకవ్వడమే కాదు.. చిరంజీవి లాంటి వ్యక్తి పొగిడేసరికి అమ్మడు ఆనందానికి హద్దులులేకుండా పోయాయి. ఇంతకీ ఏ హీరోయిన్ అనేగా మీ డౌట్ అదేనండి రకుల్ ప్రీత్ సింగ్. రామ్ చరణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న బ్రూస్ లీ సినిమా ఆడియో ఆవిష్కరణ శుక్రవారం అంటే నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను తెగ పొగిడేశారు. రకుల్ ప్రీత్ సింగ్ చాలా బ్యూటిఫుల్ హీరోయిన్. సెన్సువల్ బ్యూటీ.. ఎట్రాక్టివ్ గాళ్ అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే చిరంజీవి తనను అంతలా పొగుడుతుంటే మొదట అమ్మడు మదనపడినా తరువాత రకూల్ బుగ్గల్లో మెరుపులు మెరిస్తుంటే.. మరోవైపు నాన్న హీరోయిన్ పొగుడుతుంటే తనయుడు రాంచరణ్ సిగ్గు మొగ్గలేశాడట. కాగా గతంలో చిరంజీవి రచ్చ సినిమాలో నటించిన తమన్నాను తన పొగడ్తలతో తడిపేస్తే దాని తరువాత మళ్లీ ఇన్ని రోజులకు రకుల్ ప్రీత్ సింగ్ ను పొగిడారు. రచ్చ తరువాత రాంచరణ్ ఎన్నో సినిమాలు చేసినా చిరంజీవి ఎవరిని అంతలా పొగిడిన సందర్భాలు లేవు. మొత్తానికి తమన్నా తరువాత మళ్లీ రకుల్ కు అలాంటి కాంప్లిమెంట్స్ దక్కడం గ్రేటే.
Also Read