లయన్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
on May 22, 2015
టాలీవుడ్లో ఆల్‌టైం రికార్డ్ క్రియేట్ చేసిన లెజెండ్ తర్వాత బాలకృష్ణ నుంచి వచ్చిన 'లయన్' సినిమాకు ఫస్ట్ షో నుండే డివైడ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు అసలు కలెక్షన్స్ రావడం కష్టమని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ అందరి అంచనాలను తిప్పికొడుతూ..లయన్ మొదటి వారంలో కలెక్షన్స్ బానే రాబట్టింది. ఫస్ట్‌వీక్‌లో 'లయన్' వరల్డ్ వైడ్‌గా రూ.17 కోట్ల 70 లక్షలు కలెక్ట్ చేసాడని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయ్. ఈ సినిమా మరో రూ. 9 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా బయ్యర్ సేఫ్ జోన్ లోకి వస్తారని అంటున్నారు.
ట్రేడ్ లెక్కలు ప్రకారం ఈ సినిమా కలెక్షన్లు ఈ విధంగా వున్నాయి:
నైజాం రూ. 4 కోట్ల 39 లక్షలు
సీడెడ్ రూ. 3. 45 కోట్లు
గుంటూరు రూ. 2. 22 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 1. 57 కోట్లు
వెస్ట్ గోదావరి రూ. 1 కోటి
కృష్ణా రూ. 94 లక్షలు
ఈస్ట్ గోదావరి రూ. 93 లక్షలు
నెల్లూరు రూ. 70 లక్షలు..
టోటల్ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ కలిపి రూ. 15 కోట్ల 20 లక్షలు
కర్నాటక రూ. 1. 30 కోట్లు
ఓవర్సీస్ రూ. 70 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 50 లక్షలు
వరల్డ్ వైడ్ టోటల్ రూ. 17 కోట్ల 70 లక్షలు.