మీడియా అలా అంటోందని హర్ట్ అయ్యాడట..!
on May 16, 2016
బోనీ కపూర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంటరైనా, నటుడిగా తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు అర్జున్ కపూర్. అయితే యాక్టర్ గా కంటే, మనోడికి ప్లేబాయ్ గానే పేరు వచ్చింది. ఒకేసారి ఇద్దరితో అఫైర్ ఉన్నట్లు వార్తలు రావడమే, ఈ కుర్రాడి స్పీడ్ కు నిదర్శనం. మోడల్ అథియా శెట్టితో లవ్వాట మొదలెట్టాడని ఓ పక్క, సల్మాన్ సోదరుడి నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న మలైకా అరోరా తో వ్యవహారం నడుపుతున్నాడని మరోపక్క..ఇలా బాబుగారి మీద గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మనోడు మాత్రం అవి నన్ను చాలా హర్ట్ చేస్తున్నాయి అంటున్నాడు. సింగిల్ గా ఉండటం క్రైమ్ అని కూడా సెలవిస్తున్నాడు. నన్ను జనాలు ఎప్పుడూ ఏమీ అనుకోరు కానీ, మీడియా మాత్రం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తుంటుంది. నాకూ అందరి కుర్రాళ్లలాగే సరదగా లైఫ్ ను ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా..అయినా ప్రొఫెషన్ వరకూ ఫర్లేదు కానీ, నా వ్యక్తిగత వ్యవహారాల్లో దూరి పుకార్లు సృష్టిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటూ తనపై వచ్చిన పుకార్ల గురించి స్పందించాడు. అంతా బాగానే ఉంది కానీ, ఆడలేడీస్ తో ఏ అఫైరూ లేకపోతే, వాళ్లకు ముద్దులు పెట్టే చనువు నీకెక్కడిదబ్బాయ్ అంటూ ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ జనాలు..అదీ కరెస్టే మరి..