అనుష్క, త్రిష... పెళ్లికి రెడీ!
on Nov 26, 2014
మన కథానాయికలకు పెళ్లి మూడ్ వచ్చింది. త్వరలోనే కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది వరకు పెళ్లి మాటెత్తితే... `అప్పుడేనా, అందుకు చాలా టైమ్ ఉంది` అని సమాధానం దాటేసే కథానాయికలు `ఆ సమయం వచ్చినప్పుడు మేమే చెప్తాం..` అని తెలివిగా జవాబు ఇస్తున్నారు. కొందరైతే ''తొందర్లోనే ఆ శుభవార్త చెబుతాం'' అని ఊరిస్తున్నారు. అనుష్క, త్రిషల దృష్టి కూడా పెళ్లిపై మళ్లిందని ఏ సమయంలో అయినా వారిద్దరి నుంచి పెళ్లి శుభవార్త వినే అవకాశం ఉందని టాలీవుడ్ సమాచారం. ఈమధ్య అనుష్క పెళ్లికి సంబంధించి కొన్ని ఆసక్తికరమై కామెంట్లు చేసింది. తనకి 33 యేళ్లని, పెళ్లికి ఇదే సరైన సమయమని ఇంట్లోవాళ్లు భావిస్తున్నారని.. సరైన సమయం వచ్చినప్పుడు ఇంట్లోవాళ్లే ఈ సంగతి చెప్తారని షాకింగ్ కామెంట్ చేసింది. పెళ్లయినా సినిమాలకు దూరమవ్వాలని లేదని, చాలామంది కథానాయికలు పెళ్లయినా ఇన్నింగ్స్‌ని కొనసాగించారని, తన విషయంలోనూ అదే జరగొచ్చని అనుష్క చెబుతోంది. అంటే పెళ్లి చేసుకొని కూడా వెండి తెరని ఏలాలని ప్లాన్ చేస్తోందేమో..?? మరో వైపు త్రిషకీ పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. ఇటీవల త్రిష నిశ్చితార్థం జరిగిపోయిందని. పెళ్లికి ముహూర్తం కూడా నిర్ణయించారనే గాసిప్పు షికారు చేసింది. ఈ విషయంలో త్రిష క్లారిటీ ఇచ్చినా.. ఈ వార్త చల్లబడలేదు. ఇప్పుడు త్రిష మాట మార్చింది. నిశ్చితార్థం ఏమీ జరగలేదుగానీ, ఇంట్లోవాళ్లు పెళ్లి గురించి తొందర చేస్తున్నారని, కొన్ని సంబంధాలు కూడా వచ్చాయని, త్వరలోనే ఆ సంగతులు చెప్తానని.. మాట ఇచ్చింది. మొత్తానికి ఈ స్టార్ కథానాయికల ఇంట్లో పెళ్లి బాజా మోగబోతోందన్నమాట. వరుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
