సీతమ్మకు లక్కీ ఛాన్స్!
on Dec 2, 2014
గీతాంజలి తరవాత తెలుగమ్మాయి అంజలి తెరపై కనిపించలేదు. అటు తమిళంలోనూ అమ్మడికి అవకాశాల్లేకుండా పోయాయి. అంజలి కెరీర్ ఏమైపోతోందో అనుకొంటున్న తరుణంలో ఆమెకు మరో అవకాశం వచ్చింది. అయితే ఇది అలాంటిలాంటి అవకాశం కాదు.. అనుష్క స్థాయి కథానాయిక చేయాల్సిన పాత్ర అంజలి పాపని వెదుక్కొంటూ వచ్చింది. దర్శకుడు అశోక్.. అనుష్క కోసం భాగ్‌మతి అనే స్ర్కిప్టు తయారు చేసుకొన్నారు. ఇందులోనూ.... కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీ వగైరా వగైరా ఉంటాయి. కథ నచ్చినా తన కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమాని వదులుకొంది అనుష్క. మరి అనుష్క పాత్రలో ఎవరైతే బాగుంటారు?? అని అన్వేషించిన అశోక్‌కి.. అంజలి కనిపించింది. ఈ కథ అంజలికీ నచ్చి వెంటనే పచ్చజెండా ఊపేసింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. అంజలి భాగ్ మతిగా ఎలా ఉంటుందో..? ఈ సినిమా ఆమె కెరీర్‌ని ఏ విధంగా మారుస్తుందో చూడాలి.