నాని, సుధీర్ సిన్మాకి వచ్చిన ఆఫర్ 33 కోట్లు?
on Aug 12, 2020
ప్రేక్షకులకు ఉగాది కానుకగా మార్చి నెలాఖరున నేచురల్ స్టార్ నాని తొలిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన 'వి' చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే, కరోనా కారణంగా థియేటర్లో మూతపడడంతో కుదరలేదు. అప్పటి నుండి సినిమాకు ఓటీటీ వేదిక నుండి ఆఫర్లు వస్తున్నాయి.
థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు, నాని సహా సినిమాలో హీరోగా నటించిన సుధీర్ బాబు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకే నిర్ణయంతో ఉండడంతో ఓటీటీలోకి 'వి' రాలేదు. అయితే సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని వార్తలు మరోవైపు ఆగడం లేదు. తాజాగా ఈ సినిమాకి అమెజాన్ ప్రైమ్ నుండి 33 కోట్ల రూపాయలకు ఆఫర్ వచ్చిందట. వడ్డీల భారం ఎక్కువ ఉండడం మరోవైపు థియేటర్లు ఓపెన్ కావడానికి మరింత సమయం పట్టేలా ఉండడంతో దిల్ రాజు తన నిర్ణయం మార్చుకున్నారని, ఓటీటీకి సినిమాను అమ్మేశారని టాక్ నడుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో చూడాలి.
Also Read