2019లో రణబీర్-అలియా జోడీ సంపాదన ఇదే!
on Aug 12, 2020
రణబీర్ కపూర్, అలియా భట్ డేటింగ్లో ఉన్నారనేది కొంత కాలం క్రితం బాలీవుడ్లో హాటెస్ట్ టాపిక్. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 6లో తమ మధ్య రిలేషిన్షిప్ ఉందనే విషయాన్ని తొలిసారిగా ధ్రువీకరించింది అలియా. వచ్చే ఏడాది ఆ ఇద్దరూ పెళ్లాడతారనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇప్పటిదాకా ఆ ఇద్దరూ ఏ సినిమాలోనూ కలిసి కనిపించలేదు. అయితే ప్రస్తుతం వారి తొలి కలయికలో 'బ్రహ్మాస్త్ర' మూవీ రూపొందుతోంది. అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తోన్న ఆ సినిమా షూటింగ్.. కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని కూడా నటిస్తోన్న ఈ సినిమా 2021 ఫస్ట్ హాఫ్‌లో వస్తుందంటున్నారు. ఆ విషయం అలా ఉంచితే 2019లో వాళ్ల సంపాదన కలిపితే ఎంతవుతుందో ఓ లుక్కేద్దాం...
2019 ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 లిస్ట్‌లో 8వ ప్లేస్ పొందిన అలియా భట్.. ఆ సంవత్సరానికి అత్యధిక ఆదాయం గడిచిన బాలీవుడ్ నటిగా నిలిచింది. ఆమె బ్యాంక్ అకౌంట్‌కు రూ. 59.21 కోట్లు జమ అయ్యాయి. ప్రధానంగా 'గల్లీ బాయ్' సక్సెస్‌తో ఈ ఆదాయంలో అధిక భాగం ఆమెకు సమకూరింది. సినిమాలతో పాటు లేస్, ఫ్రూటి, ఉబర్ ఈట్స్, ఫ్లిప్‌కార్ట్, గార్నియర్ వంటి బ్రాండ్ల ద్వారా ఆమె ఆదాయం సంపాదించింది.
రణబీర్ కపూర్ విషయానికి వస్తే, 2019లో అతని సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ 2018లో వచ్చిన కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ 'సంజు' ద్వారా అతని బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. 2019 ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 లిస్ట్‌లో 45వ స్థానానికి పడిపోయాడు రణబీర్. 2018 లిస్ట్‌లో అతనిది 17వ స్థానం. అయినప్పటికీ ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా అతను రూ. 4 కోట్ల నుంచి 5 కోట్ల దాకా అందుకున్నాడు. అలా పది బ్రాండ్ల ద్వారా 2019లో అతను రూ. 45 కోట్లు ఆర్జించాడు.
అంటే.. 2019లో రణబీర్, అలియా ఇద్దరి సంపాదన కలిపితే రూ. 104.21 కోట్లు. అదీ సంగతి!
Also Read