అది మిస్ చేసుకోనంటున్న"అఖిల్"
on Oct 28, 2015
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా, హీరో నితిన్ నిర్మాతగా.. వినాయక్ డైర్క్షన్ లో వస్తున్న సినిమా "అఖిల్" పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా దసరా పండుగ కానుకగా ప్రేక్షకులముందుకు వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు కానీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశ చెందిన మాట వాస్తవం. కానీ ఈసారి మాత్రం అఖిల్ టీం దీపావళిని మిస్ చేసుకోకూడదని భావిస్తుందట. ఎలాగైనా సరే దీపావళికి ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే సరైన ప్లాన్ చేసుకొని దీపావళికి అంటే నవంబర్ 11వ తేదీన గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి అఖిల్ రంగం సిద్దం చేసుకుంటున్నాడు. మరి ఈ పండుగనైనా ఉపయోగించుకుంటారో లేదో చూద్దాం.