అఖిల్ ఆమెకి ఫిదా అయిపోయాడా?
on May 23, 2015
సిసింద్రీగా మెప్పించిన అఖిల్ ని హీరగా చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఉత్సాహపడుతున్నారు. ఆ సమయం ఎంతోదూరం లేదు. అయితే సినిమా కన్నా మనోడు యాడ్స్ తోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించేసుకుంటున్నాడు. అయితే మన్నధుడి కొడుకు కావడంతో కుర్రాడిని అప్పుడే అందాన్ని, అభినయాన్ని ఆస్వాదించడం బాగా తెలిసినట్టుంది. శ్రద్ధాకపూర్ సో స్వీట్ అని తెగ పొగిడేస్తున్నాట. అఖిల్ నోటివెంట శ్రద్ధా మాటెందుకొచ్చిందనేగా మీ డౌట్.... ఏబీసీడీ ట్రైలర్లో సెక్సీ బ్యూటీ ఫెర్ ఫామెన్స్ చూసి అఖిల్ ఫిదా అయిపోయాడట. శ్రద్ధా హ్యాట్సాఫ్ అని మెసేజ్ ఇచ్చాడట. పైగా శ్రద్ధ అంత ఈజ్ తో డాన్స్ వేయాలనుందన్నాడు. నవ మన్మధుడి ఇంట్రెస్ట్ చూస్తుంటే నెక్ట్స్ మూవీలో శ్రద్ధాతో రొమాన్స్ చేసేట్టే ఉన్నాడు. ఇప్పటికే కల్కీకొచ్చితో ఓ యాడ్ లో హాట్ హాట్ గా కనిపించిన సంగతి తెలిసిందే. అయినా కనిపించడు కానీ కుర్రాడు ముదురే అని సెటైర్స్ వేస్తున్నారంతా.