బోరున ఏడ్చేసిన కత్రినా.. కారణం అతనేనా?
on Oct 28, 2015
పాపం కత్రినా ఏం కష్టమొచ్చిందో ఏమో బోరున ఏడ్చేసిందట. కత్రినా ఏంటీ ఏడవడం ఏంటీ.. ఏదో సినిమాలో ఏడ్చింది అనుకుంటున్నారా? నిజంగానే పబ్లిక్ గా ఏడ్చేసిందట. ముబైలోని బాద్రాలో ఉన్న చర్చికి వెళ్లిన కత్రినా అక్కడ మేరీ మాత ముందు విలపించిందట. దీనిని వెంటనే ఓ మీడియా కు సంబంధించిన వ్యక్తి ఫోటోలు తీశాడు.. అయితే ఈ విషయం గమనించిన కత్రినా తన ఫోటోలు బయట పెట్టొద్దని ప్రాధేయపడటంతో అతను ఆ ఫొటోలు పబ్లిష్ చేయలేదు. కానీ వార్త మాత్రం ఆగుతుందా అది ఆనోట ఈ నోట పాకి బీ టౌన్ లో హాట్ టాపిక్ అయింది. అసలు కత్రినా ఎందుకు ఏడ్చింది.. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ రణబీర్ విషయంలో ఏడ్చిందా అంటూ పలు రకాల ప్రశ్నలు అప్పుడే మొదలయ్యాయి.
ఎందుకంటే మొదట సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగించిన కత్రినా ఆ తరువాత అతనితో విడిపోయి రణబీర్ కపూర్ తో ప్రేమలో పడింది. దాదాపు మూడేళ్లు పాటు డీప్ లవ్ లో ఉన్న కత్రినా, రణబీర్లు.. ఇదిగో ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు.. అప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి తప్పా అది జరిగిందీ లేదు. ఇప్పుడు అసలు ఆ ఊసే ఎక్కడా వినిపించడంలేదు. అయితే కత్రినా పెళ్లికి రెడీగా ఉన్నా.. రణబీర్ మాత్రం ఈ విషయాన్ని ఏటూ తెల్చడంలేదని కొంతమంది చెబుతున్నారు. దీంతో ఈ ఫ్రస్ట్రేషన్ లోనే కత్రినా ఏడ్చేసి ఉంటుందని అనుకుంటున్నారు. ఇంతకీ కత్రినా ఎందుకు ఏడ్చిందో కత్రినానే చెప్పాలి..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
