ప్రభాస్ వంటి మిస్టర్ పర్ఫెక్ట్ కావాలి..!!
on Jul 19, 2018
తెలుగు ప్రేక్షకులను, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న రెండు సంవత్సరాలే వేధించింది.. కానీ ప్రభాస్ పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఇప్పటికీ ప్రేక్షకులను వేధిస్తూనే ఉంది.. బాహుబలి 1, 2 అయిపోయాయి కానీ ప్రభాస్ పెళ్లి మీద క్లారిటీ రాలేదు.. అదిగో ఆ అమ్మాయితోనే ప్రభాస్ పెళ్లి, ఇదిగో ఈ అమ్మాయితోనే ప్రభాస్ పెళ్లి అంటూ గాసిప్స్ కూడా వినిపించాయి.
అంతెందుకు ప్రభాస్ తో కలిసి నటించిన అనుష్క తోనే ప్రభాస్ పెళ్లి అని కూడా వార్తలు వచ్చాయి.. ఇటీవల ఈ వార్తలపై స్పందించిన అనుష్క 'ప్రభాస్, నేను పెళ్లి చేసుకోవడం లేదు.. దయచేసి రియల్ లైఫ్లో బాహుబలి, దేవసేన కెమిస్ట్రీని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు.. అది స్క్రీన్ వరకూ మాత్రమే’ అని తెలిపింది.. అయినా ప్రభాస్, అనుష్కల పెళ్లి అంటూ రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. అయితే తాజాగా ఈ విషయంపై అనుష్క తల్లి కూడా స్పందించారు.. 'వాళ్లిద్దరూ స్టార్స్.. ఇద్దరూ కలిసి నటించారు.. నాకు అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్ఫెక్ట్ కావాలనే ఉంది.. కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే.. వారి పెళ్లి గురించి రూమర్స్ స్ర్పెడ్ చేయడం ఆపండి' అని తెలిపారు.