విజయ్ కోసం క్లైమాక్స్ మార్చుకున్న మహేష్
on May 4, 2017
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న స్పైడర్ ని మొదట జూన్ 23 కి విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ, షూటింగ్ డిలే వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇంతకీ, షూటింగ్ ఎందుకు డిలే అయింది అంటారా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న స్పైడర్ క్లైమాక్స్ ఈ మధ్య విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ చిత్రం కవన్ క్లైమాక్స్ కి దగ్గరి పోలికలు ఉన్నాయంట. ఈ విషయం తన వాళ్ల ద్వారా తెలుసుకున్న మురుగదాస్ కొంచెం టైం తీసుకొని క్లైమాక్స్ మార్చాడట. మహేష్ కి, నిర్మాతలకి కూడా నచ్చడంతో వాళ్ళు ప్రొసీడ్ అన్నారట.
ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంచెం సమయం పట్టడంతో షూటింగ్ లో డిలే జరిగింది. స్పైడర్ దర్శక, నిర్మాతలు తమ సినిమాని ఆగష్టు 11 కి విడుదల చేద్దాం అనుకుంటున్నారు. కానీ, అజిత్ నూతన చిత్రం వివేగం కూడా అదే రోజు రిలీజ్ అవుతుండడంతో సందిగ్ధంలో పడ్డారు. ఆగష్టు 11 కే విడుదల చేద్దామా, లేదంటే, ఒకటి రెండు వారాలు పోస్ట్ పోన్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న స్పైడర్, మహేష్ కి తమిళంలో మొదటి సినిమా. కాబట్టి, అజిత్ తో పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవు. మురుగదాస్ కి తమిళ్ లో ఫాలోయింగ్ ఎక్కువే, కానీ అజిత్ ముందు ఆయన పప్పులు ఉడకవు. మరి, ఇలాంటి సిట్యుయేషన్ లో రిస్క్ తీసుకుంటారా, లేక తప్పుకుంటారో చూడాలి.
Also Read