మహేష్ కోసం రూ.40 కోట్లు ఎక్స్ ట్రా
on May 24, 2017
బడ్జెట్ అనేది ఎవరి కంట్రోల్లోనూ ఉండడం లేదు. కొబ్బరికాయ్ కొట్టేముందు అనుకొనే బడ్జెట్ ఒకటి.. సినిమా పూర్తయ్యేలోగా కనిపించే బడ్జెట్ మరోటి. అనుకొన్న బడ్జెట్లో సినిమా పూర్తి చేయగలిగే తెలివితేటలు ఎవ్వరికీ ఉండడం లేదు. స్టార్ హీరోల సినిమా అయితే... ఇక చెప్పక్కర్లెద్దు. రాసుకొన్న అంకెలకూ, వాస్తవానికీ పోలిక ఉండదు. మహేష్ సినిమా విషయంలో అదే జరుగుతోంది. మహేష్ - మురుగదాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న సినిమా స్పైడర్. ఈ సినిమాని రూ.70 కోట్లలో పూర్తి చేయాలని చిత్రబృందం భావించిందట.
అయితే ఇప్పుడు రూ110 కోట్లకు లెక్క తేలిందని తెలుస్తోంది. అంటే రూ.40 కోట్లు ఎక్కువైపోయాయన్నమాట. మధ్య మధ్యలో రీషూట్ల వల్ల.. సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. అందుకే బడ్జెట్ కూడా పెరిగిపోయిందని తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో రాజీ పడలేని ప్రొడ్యూసర్లు కావాలనే ఎక్కువ ఖర్చు పెట్టారని చెబుతున్నారు. మహేష్ సినిమా అంటే కచ్చితంగా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తప్పనిసరి. ఎలాగూ వంద కోట్లు వచ్చేస్తాయన్న ధీమాతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశార్ట. సినిమాకి రూ110 కోట్లు అయ్యిందంటే.. దాన్ని తిరిగి రాబట్టుకోవాలంటే మాత్రం రూ.150 కోట్లకు మించి వసూళ్లు అందుకోవాలి. మరి స్పైడర్ ఆ మైలురాయిని అందుకొంటాడా? వెయిట్ అండ్ సీ.