English | Telugu

అమ్మతోడు నాకాఅమ్మాయి తెలీదు

on Aug 8, 2017

 

‘ఓవియా’... ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారిన పేరిది. ఎక్కడ చూసినా ఓవియా మేనియానే. ఈమె వ్యవహారం ఇప్పుడు తమిళ హీరో శింబుకి కూడా తలనొప్పిగా మారింది. ఇంతకీ ఈ ఓవియా ఎవరు? అనేగా మీ ప్రశ్న.  ఈమె తమిళతెరపై కొత్తగ పరిచయమైన ఓ నటి. కమల్ హాసన్ వ్యాఖ్యాత బుల్లితెరపై ప్రసారమవుతున్న‘బిగ్ బాస్’రియాలిటీ షో ద్వారా ఓవియాకు కాస్త పాపులారిటీ పెరిగింది. ‘బిగ్ బాస్’లో చాలామంది పాల్గొన్నా... ఓవియాకే ఎందుకంత పాపులారిటీ అంటే... ఈ అమ్మాయి ‘బిగ్ బాస్’షోలో ఆత్మహత్యాప్రయత్నం చేసింది. ఓవియా చేసిన ఈ అఘాయిత్యానికి బుల్లితెర వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ నిర్ఘాంతపోయారు. చివరకు ఎలాగొలా గండం గట్టెంక్కిందనుకోండి.  అసలు తమిళ నాట ‘బిగ్ బాస్’షో మొదలైనప్పట్నుంచీ వివాదాలే. ‘తమిళ ప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న ఈ ‘బిగ్ బాస్’ని వెంటనే ఆపివేయాలి’ అని ఉద్యమాలు కూడా జరుగుతున్నాయ్.

కానీ... కమల్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా చేసుకుంటూ పోతున్నాడు. అది వేరే విషయం. ఇక ఓవియా విషయానికొస్తే... ఈ అమ్మాయిని రీసెంట్ గా ‘బిగ్ బాస్’ షో నుంచి బయటకు పంపేశారు. కొన్ని కారణాల వల్ల మానసికంగా కుంగిపోయిన ఓవియా ఆత్మహత్యకు పాల్పడం, హౌస్ నుంచి తానే వెళ్లిపోతానని కోరడం.. ఇత్యాది కారణాల వల్ల ఆమెను షో నుంచి తప్పించడం జరిగింది. ఇదిలావుంటే... ‘ఓవియాకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఒప్పుకుంటే  ఆమెను వివాహం చేసుకుంటాను’ అని  హీరో శింబు ప్రకటించినట్టు... ఓ స్టేట్మెంట్ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది ఇది నిజమే అని కూడా అనుకున్నారు.

ఈ విషయం శింబు దాకా వెళ్లింది. ఇకేముంది...? లిటిల్ సూపర్ స్టార్ నిప్పులు కక్కడం మొదలుపెట్టాడు. ‘ఎవరీ ఓవియా. నాకు అసలు ఆ అమ్మాయే తెలీదు. నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి... కావాలనే నన్ను ఇలా బజారుకి ఈడుస్తున్నారు. వారెవరో నాకు తెలుసు. వాళ్లకు తగిన బుద్ధి చెబుతా’అంటూ శింబు తన వ్యక్తిగత పేస్బుక్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ఓ ప్రకటన విడుదల చేశాడు. అయితే, ఈ వ్యవహారాలపై ఓవియా మాత్రం ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here