ప్రేమతో మీ లక్ష్మీకి మంచి ఆదరణ
on Jul 18, 2011
"ప్రేమతో మీ లక్ష్మీ"కి మంచి ఆదరణ లభిస్తూంది. వివరాల్లోకి వెళితే కలెక్షన్ కింగ్, పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న ఈటి.వి.లో నిర్వహిస్తున్న "ప్రేమతో మీ లక్ష్మీ" కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తూంది. మంచు లక్ష్మీ ప్రసన్న చేస్తున్న "ప్రేమతో మీ లక్ష్మీ" కార్యక్రమానికింతటి ఆదరణ లభించటానికి కారణం ఏంటని ఆలోచిస్తే...దీనికి ఆమె చేసిన విశేష కృషి దీని వెనుక ఉందనేది నిర్వివాదాంశం.
ఒక సెలబ్రిటీని అది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావచ్చు లేదా రాజకీయ రంగానికి చెందిన వ్యక్తి కావచ్చు లేదా మరే రంగానికి చెందిన వారైనా కావచ్చు...వారిని ఇంటర్ వ్యూ కి పిలిస్తే వారి పూర్వాపరాలు తెలుసుకుని వారి బాల్యస్నేహితులను పట్టుకుని ఈ సెలబ్రిటీ గురించి వారి అభిప్రాయాలను సేకరించి, వచ్చిన సెలబ్రిటీలనే ఆశ్చర్యపరిచే స్థాయిలో వారి గురించి రీసెర్చ్ చేసి, ఈ "ప్రేమతో మీ లక్ష్మీ" కార్యక్రమాన్ని రక్తి కట్టించటం వల్లే దీనికి ఇంతటి ప్రజాదరణ లభించిందని తెలుస్తోంది. అంతే గాక టి.ఆర్.పి. రేటింగ్స్ లో కూడా ఈ "ప్రేమతో మీ లక్ష్మీ" కార్యక్రమం టాప్ లో ఉండటం విశేషం.