సూపర్ స్టార్ తో మళ్ళీ ఐస్ క్రీమ్ పాప
on May 21, 2015
‘సీతమ్మ వాకిట్లో సిరిమేల్లె చెట్టు’ చిత్రం లో మహేష్ బాబు పక్కన కనిపించిన ఈ ముద్దు గుమ్మ తేజశ్వి మరోసారి ప్రిన్స్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వం లో ‘శ్రీమంతుడు’ అనే చిత్రం లో ఓ కీలక పాత్ర కోసం తేజశ్వి ని తీసుకోవడం జరిగిందట. ప్రస్తుతం మహేష్ – తేజశ్వి ల మద్య వచ్చే సీన్స్ రామోజీ ఫిలిం సిటీ లో షూట్ చేస్తున్నారని సమాచారం. తేజశ్వి ని కూడా ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా మారి వరుస ఆఫర్స్ తో దుసుకపోతుంది. ఈ సందర్భంగా తేజశ్వి ని మీడియా తో మాట్లాడుతూ ''మహేష్ బాబు తో నటించడం చాల ఆనందంగా ఉందని , మహేష్ తో ఎప్పుడు నటించిన చాల కొత్తగా ఉంటుందని ‘ చెప్పుకొచ్చింది.