పెదరాయుడు పాత్రలో మంచు మనోజ్!!
on Sep 12, 2018
'పెదరాయుడు' సినిమా ఓ ట్రెండ్ సెట్టర్.. పెదరాయుడుగా మోహన్ బాబు నట విశ్వరూపం చూపించారు.. ఇక ఆ సినిమాలో పాపారాయుడు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి.. రజినీకాంత్ పోషించిన ఈ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ఇప్పుడు అలాంటి పాత్రలోనే మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కనిపించబోతున్నాడు.. శ్రీకాంత్ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న సినిమా ‘ఆపరేషన్ 2019’.. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాలో మంచు మనోజ్‌కుమార్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్నారు.. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.. ఈ సందర్భంగా లొకేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ.. ‘శ్రీకాంత్‌గారితో నాకిది రెండో సినిమా.. చెన్నైలో జరిగిన ఒక ఘటన ఆధారంగా నేను ఈ సినిమా స్టార్ట్ చేశా.. సునీల్‌గారు కథ విన్న వెంటనే అంగీకరించారు.. మనోజ్గారు కథ వినగానే ‘పెదరాయుడు’లో రజనీకాంత్‌గారి పాత్రలా ఉంది.. సూపర్.. నేను చేస్తున్నా’ అని వెంటనే అంగీకరించారు’ అన్నారు.. మరి పాపారాయుడు తరహా పాత్రలో మనోజ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.