ప్రెగ్నెంట్ అయినా పనులు మానలేదు
on Aug 14, 2020
కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెంట్. ఇటీవల రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్టు ప్రకటించింది. గర్భవతి కాబట్టి పని చేయకుండా కరీనా కపూర్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటుందని అనుకుంటే పొరబడినట్టే. ప్రెగ్నెంట్ అని ప్రకటించిన రెండు రోజుల తరవాత మళ్లీ వర్క్ కమిట్మెంట్స్ కంప్లీట్ చేయడానికి ముందుకొచ్చింది.
కరీనా కపూర్ మేకప్ ఆర్టిస్ట్ పొంపై రీసెంట్గా ఒక ఫొటో పోస్ట్ చేశారు. మేకప్ ఆర్టిస్ట్ సహా హెయిర్ స్టయిలిస్ట్తో కరీనా ఫొటోకి పోజు ఇచ్చారు. ఆఫ్-వైట్ కుర్తీలో బిబో దేవకన్యలా మెరిసింది. బేబీ బంప్ ఏమీ కనిపించలేదు. ఎప్పటిలా కరీనా నాజూకుగా ఉన్నారు. డెలివరీ దగ్గరకు వచ్చే సమయానికి అంగీకరించిన సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేయాలని కరీనా భావిస్తున్నారట. ఆమిర్ ఖాన్ సరసన 'లాల్ సింగ్ చద్దా'లో కరీనా నటిస్తున్నారు. అలాగే, కొన్ని వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తున్నారట.
Also Read