దగ్గుబాటి వారింట... మిహీకా సమేత రానా సందడంతా!
on Aug 12, 2020
ఇప్పుడు దగ్గుబాటి వారి ఇంట... సందడి అంతా రానా మిహీకా దంపతులదే! కొత్తజంటతో ఇల్లంతా కళకళలాడుతోంది. పెళ్లి తరవాత పూజలు, పునస్కారాలు, వ్రతాలు ఉండడం సహజమే. వాటితో సమయం తెలియకుండా గడిచిపోతుందట. దగ్గుబాటి కుటుంబంలో ఎటు చూసినా సంతోషాలే. ఇటీవల తెలుగు సంప్రదాయం ప్రకారం సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. అలాగే... మిగతా పూజలు, కార్యక్రమాలు పూర్తయ్యాయని సమాచారం. మరి, కొత్తజంట రానా మిహీకా ఫోటోలు చూశారా? ఇదిగో వాటిపై ఓ లుక్కేయండి.
పెళ్లి సందడి మొదలైనప్పటి నుండి రానా ఒక్కటే లుక్ మెయిన్ టైన్ చేస్తున్నారు. తెల్ల పంచె, షర్టు లేదా పట్టు పంచె, షర్టులో కనపిస్తున్నారు. పెళ్లిలో మాత్రం డ్రెస్ కోడ్ మారిందనుకోండి. మిగతా కార్యక్రమాలలో మాత్రం సేమ్. మరోవైపు రానా సతీమణి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ లలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.