అతడు విజయ్ దేవరకొండ సినిమాలో నటించడం లేదట!
on Aug 11, 2020
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్. సినిమాలో ఆమెకి తండ్రిగా చుంకీ పాండే నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. రియల్ లైఫ్లో తండ్రీకూతుళ్ళైన చంకీ, అనన్యా.. పూరి సినిమాలోనూ తండ్రీకూతుళ్ళుగా నటిస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే, అటువంటిది ఏమీ లేదని చుంకీ పాండే స్పష్టం చేశారు.
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ సినిమాలో అనన్యాకి తండ్రిగా నటించడం లేదని ఆయన చెప్పారు. ‘‘తెరపై అనన్యాకు తండ్రిగా నటించడం నాకిష్టమే. కానీ, ఇప్పుడు మీరు వింటున్నవన్నీ రూమర్లే’’ అని చుంకీ పాండే అన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘పైటర్’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ‘లైగర్’ టైటిల్ కన్ఫార్మ్ చేశారని టాక్. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో సినిమాను విడుదల చేయనున్నారు.