22న అభిమానులకు పండగే!
on Aug 19, 2017
ఈ నెల 22 కోసం మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కారణం...మెగాస్టార్ పుట్టిన రోజు మాత్రమే కాదు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’చిత్రం మోషన్ పోస్టర్ విడుదల కూడా అదే రోజున. అభిమానుల్లో ఆ ఉత్సాహం అందుకే..
ఈ సినిమాకు ‘మహావీర’టైటిల్ అనుకుంటున్నట్లు టాక్. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకునిగా ఖరారైనట్లు తెలుస్తోంది. నయనతార ఇప్పటికే ఓ కథానాయికగా ఎంపిక కాగా.. మరో కథానాయిక పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ తో సంప్రదింపులు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కన్నడ నటులు ఉపేంద్ర, సుదీప్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది.
సాయిమాధవ్ బుర్రా... ఇప్పటికే ఈ సినిమా బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. షూటింగ్ అనేది మొదలైతే... శరవేగంగా పూర్తి చేయాలనీ, వచ్చే వేసవికి ఈ చిత్రం విడుదల ఉండాలని మెగాస్టార్ ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డికి సూచించినట్లు తెలిసింది. ఇదిలావుంటే... ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని మెగా క్యాంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్.రాజమౌళి అతిధిగా హాజరవుతారనీ... ఆయన చేతులమీదుగానే ఆవిష్కరణలు జరుగుతాయనీ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అంటే... ఆ రోజునే సినిమా టైటిల్ కూడా తెలిసిపోతుంది. ఫ్యాన్స్ ఇక పండగ చేసుకోండి!