'శివగామి' ఆడియో విడుదల!
on Jun 25, 2016
తెలుగు, కన్నడ బాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న హారర్ ఎంటర్టైనర్ ను తెలుగులో "శివగామి", కన్నడలో "నాని" అనే టైటిల్స్ తో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబీ సుహాసిని, జై జగదీష్ లు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సుహాసిని ఓ ముఖ్యభూమిక పోషించింది. ఎం.ఎస్.జైరాజ్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమా పాటల విడుదల వేడుక నేడు (జూన్ 25) హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి సంయుక్తంగా "శివగామి" ఆడీయో సీడీలను విడుదల చేశారు. సీనియర్ దర్శకులు ఓం సాయి ప్రకాష్ తొలి ప్రతిని అందుకొన్నారు.
ప్రముఖ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. "తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు సక్సెస్ ఫుల్ హారర్ బేస్డ్ ఫిల్మ్స్ చాలానే తీశారు. సుమారుగా 88 సినిమాలు చేసిన ఆయన 100 చిత్రాల దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ సినిమా ఆయనకు పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
సీనియర్ దర్శకులు ఓం సాయి ప్రకాష్ మాట్లాడుతూ.. "కన్నడలో 85 సినిమాలు, తెలుగులో 14 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఈమధ్య కన్నడ సినిమాలపై తెలుగువారు ఆసక్తి చూపిస్తున్నారు. నాకు సంతోషం కలిగించిన అంశం ఇది" అన్నారు.
చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "కన్నడలో నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయాలని, నిర్మాత రమేష్ కుమార్ జైన్ నాతో అసోసియేట్ అయ్యారు. టేస్ట్ ఉన్న నిర్మాతాయన. సుమంత్ ఈ చిత్రాన్ని అత్యుద్భుతంగా తెరకెక్కించారు. జూలై మొదటివారంలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా మన తెలుగువారికి నచ్చుతుందని ఆశిస్తున్నాను" అన్నారు.
రమేష్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. "గుజరాత్ లో జరిగిన ఓ యధార్థ సంఘటనను బేస్ చేసుకొని తెరకెక్కించిన సినిమా ఇది, తెలుగులో కూడా మా సినిమా విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు.
దర్శకుడు సుమంత్ మాట్లాడుతూ.. "తెలుగు, కన్నడ బాషల్లో ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు" అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర అతిధులు "శివగామి" సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని అభిలషించారు!