అర్థరాత్రి ప్రభాస్ గది తలుపు తట్టిన తమన్నా!
on Jun 27, 2015
దేశమంతా బాహుబలి గురించి ఎదురుచూస్తోంది. ప్రభాస్ అభిమానులైతే.. బాహుబలి గురించిన ఒక్క వార్త బయటకు వచ్చినా సంబరపడిపోతున్నారు. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణలు కూడా `బాహుబలి`కి తాము పడిన కష్టాల్ని కథలు కథలుగా బయటపెడుతున్నారు. ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది.
ఈ సినిమా కోసం తానెంత కష్టపడిందో, తనకెవరెవరు ఎలా సహాయపడ్డారో పూసగుచ్చినట్టు వివరించింది. తన పదేళ్ల కెరీర్‌లో ఏ సినిమాకీ పడని కష్టం ఈ సినిమాకి పడిందట తమన్నా. ఒక్కొక్క సీన్ కోసం ఏకంగా పద్దెనిమిది గంటలు కష్టపడాల్సివచ్చిందట. శారీరకంగా మానసికంగా బాగా అలసిపోయేదట.
రాజమౌళి, ప్రభాస్‌లు తనకెంతో సహకారం అందించాట. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఇచ్చిన చిట్కాలతోనే తాను.. అంతబాగా నటించగలిగిందట. తనకు ఏ డౌట్ వచ్చినా.. అది అర్థరాత్రయినా సరే.. ప్రభాస్ గది తలుపు తట్టేదట. ప్రభాస్ కూడా ఓపిగ్గా.. తన సందేహాలు తీర్చేవాడట. కత్తి ఎలా పట్టాలా? ఫైట్స్ ఎలా చేయాలి? అనే విషయంపై ప్రభాస్ తనకు విలువైన సలహాలు ఇచ్చాడని మురిసిపోతోంది తమన్నా.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
