రిలీజైన పవన్ కళ్యాణ్ పెళ్లి గెటప్
on Mar 15, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్.ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమా కోసం పవన్ రేయింబవళ్లు కష్టపడి చిత్రీకరణ జరుపుతున్నాడట. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుదలవడం అభిమానులకు మంచి జోష్ ఇస్తోంది. కాగా, బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సగం విజయం సాధించి పెడుతుందని అందరూ భావిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఆడియోను ఈ నెల 20న విడుదల చేస్తున్నారు.
ఆడియో విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది “సర్ధార్ గబ్బర్ సింగ్” స్టిల్స్ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి సంబంధించి రిలీజైన స్టిల్స్ మొత్తంలో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు పోలీస్ గెటప్ లోనే కనిపించాడు. ఇటీవలే రిలీజైన స్టిల్స్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో కాకుండా పెళ్లి కొడుకు గెటప్ లో దర్శనమిచ్చాడు. తలపాగా చుట్టుకుని పెళ్లి కొడుకు గెటప్ లో వున్న పవన్ పక్కనే కమెడియన్ కృష్ణ భగవాన్ కూడా వున్నాడు. ఈ స్టిల్ ప్రస్తుతం పవన్ అభిమానుల షేర్స్ తో హంగామా చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల చేస్తామని అధికారిక ప్రకటన ఇచ్చారు.