ప్రేమంటే చేదంటున్న చెర్రీ
on Apr 30, 2015
ప్రేమ అనే మాట వింటేనే చరణ్ వణికిపోతున్నాడట. ఏంటి కొంపతీసి ఉపాసన ఏమైనా హ్యాండిచ్చిందా? ప్రేమపై అంత విరక్తి కలగడానికి కారణమేంటి? అని వరుస అస్త్రాలు సంధించేయకండి. ఆరెంజ్ పుణ్యమా అని ప్రేమకథ అంటే భయపడిపోతున్నాడట. ఎందుకంటే చెర్రీ కెరీర్లో భయంకరమైన డిజాస్టర్ ఆ చిత్రం. నిర్మాత నాగబాబుని ఆత్మహత్య వరకూ తీసుకెళ్లిన గొప్పచిత్రమది. ఆ సెగ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అందుకే ఏ దర్శకుడైనా ప్రేమకథ చెబుతా అంటే నో వే అంటున్నాడట. ఈ మధ్య వచ్చిన ఒక లైలా కోసం మొదట చెర్రీకే చెప్పిన విజయ్ కుమార్ కొండా....ఆ తర్వాత నాగచైతన్యతో తెరకెక్కించాడు. అదే టైమ్ లో క్రిష్ కూడా ప్రేమకథ చెబితే వద్దన్నాడట. దీంతో గౌతమ్ మీనన్ సైతం ఇంకెందకులే అనుకుని చైతూతో మరోసారి మాయ చేసేందుకు సిద్ధపడ్డాడట. ఈ సంగతంతా సరే కానీ.... చెర్రీ ఎందుకంత భయపడిపోతున్నాడు? మాస్ యాక్షన్ హీరో ఇమేజ్ పోతుందేమో అనే ఆలోచనలో ఉన్నాడా? లేదా ఆరెంజ్ కొట్టిన ఓ రేంజ్ దెబ్బకు ప్రేమకథల జోలికి పోదల్చుకోలేదా? ఇదే నిజమైతే మెగా అభిమానులు ఎప్పటికీ చరణ్ ని మంచి ప్రేమికుడిగా చూడలేరా? వీటిన్నింటికీ సమాధానం రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి మరి.