రకుల్ కోసం తెగ చూసేస్తున్నారు
on Dec 2, 2014
ఈవారం విడుదలైన సినిమాల్లో రఫ్.. డిజాస్టర్ అని సినీ విశ్లేషకులు తేల్చేశారు. కథలో స్టప్ లేదని కౌంటర్లూ వేశారు. అరిగిపోయిన స్ర్కీన్ ప్లేతో దర్శకుడు సుబ్బారెడ్డి తెగ విసిగించడాని స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అయితే జనానికి ఇవేం ఎక్కడం లేదు. రఫ్ ని తెగ చూస్తున్నారు. ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ.6 కోట్లకు పైనే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ వారం దాదాపు 7 సినిమాలు విడుదలయ్యాయి. టికెట్లు తెగుతోంది మాత్రం రఫ్ కే. కారణం ఏంటని ఆరాతీస్తే... రకుల్ ప్రీత్ సింగ్ అని తెలిసింది. అవును.. ఈసినిమాలో రకుల్ సెంట్రాప్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ మధ్య వరుస హిట్లతో దుమ్ము రేగ్గొడుతోంది రకుల్. తన గ్లామర్‌తో యువ ప్రేక్షకుల్ని థియేటర్ వరకూ రప్పించే సత్తా ఉందని చాటుకొంది. రఫ్ విషయంలోనూ అదే జరిగింది. పోస్టర్ పై రకుల్ అందాలు, ట్రైటర్‌లో ఆదికి ఇచ్చిన లిప్ లాక్... యూత్‌ని బాగా ఊరిస్తున్నాయి. అందుకే వాళ్లంతా థియేటర్లలో వాలిపోతున్నారు. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ తొలిసినిమా ఇదే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కంటే ముందు ఈ సినిమా ఒప్పుకొంది. అయితే ఆలస్యంగా విడుదలైంది. ఏదైతేనేం... రకుల్ వల్ల రఫ్ నిలబడింది. నాలుగు డబ్బులు సంపాదించుకొంటోంది. నిర్మాతలకు అది చాలు కదా..?!