చిరు - రాత్రంతా.. డాన్సింగే డాన్సింగ్
on Aug 31, 2015
చిరంజీవిలో జోష్ ఏమాత్రం తగ్గలేదు. మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తున్నాడుగా.. తన డాన్సింగ్ టాలెంట్ అంతా చూపించేశాడు. రాత్రండా డాన్స్ చేస్తూ.. ఖుషీ ఖుషీగా గడిపాడు. తనదైన స్టెప్పులు వేసి అలరించాడు. ఇదంతా సినిమాల కోసం కాదు. ఓ పార్టీలో చిరు చేసిన హంగామా ఇది. 80వ దశకంలోని దక్షిణాది తారలంతా చెన్నైలో ఘనంగా పార్టీ చేసుకొన్నారు.
చిరంజీవి, వెంకటేష్, మోహన్‌లాల్, సుహాసిని, రాధిక, ఖుష్బూ ఇలా హేమా హేమీలంతా ఈ పార్టీలో పాల్గొన్నారు. శనివారం రాత్రి మొదలైన ఈ పార్టీ ఆదివారం పొద్దుపోయేంత వరకూ సాగింది. ఈ పార్టీలో చిరు వేసిన లుంగీ డాన్స్ హైలెట్‌గా నిలిచిందట. చిరు ఒక్కడే కాదు.. రాధిక, సుహాసిని, మోహన్‌లాల్, వెంకీ, సుమన్, భానుచందర్ ఇలా అందరూ స్టెప్పులతో అదరగొట్టేశారట.
80 దశకంలో తన ప్రభావం చూపించిన తారలంతా ఇలా ప్రతీ యేడూ కలసి పార్టీ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ కార్యక్రమంలో నాగ్, బాలకృష్ణ మాత్రం మిస్సయ్యారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
