పవన్, అనుష్క... కాంబో??
on Apr 28, 2015
త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబు కోసం స్ర్కిప్టు రాసుకొనే పనిలో ఉన్నాడు. అయితే సమాంతరంగా `కోబలి`కి సంబంధించిన చర్చలూ సాగిస్తున్నాడట. మహేష్ బాబు తో సినిమా పూర్తవ్వగానే కోబలిని ప్రారంభించాలని పవన్, త్రివిక్రమ్‌లు నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఈ సినిమాలో కథానాయికగా ఎవరైతే బాగుంటారు? అనే విషయంపై కూడా పవన్, త్రివిక్రమ్‌ల మధ్య చర్చసాగిందట. త్రివిక్రమ్ ఛాయిస్‌లో ఉన్న నాయిక అనుష్క మాత్రమేనట. ఈ విషయాన్ని పవన్‌కీ చెప్పాడట. పవన్ కూడా అనుష్క విషయంలో సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. పవన్ - అనుష్కల కాంబినేషన్ ఇప్పటి వరకూ చూసే ఛాన్స్ దక్కలేదు. మరి ఆ అవకాశం త్రివిక్రమ్ కల్పిస్తాడేమో చూడాలి. ఈ 2015 చివర్లో గానీ 2016 ప్రారంభంలోగానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుందని తెలుస్తోంది.