వ్యభిచారం కేసులో మరో టాలీవుడ్ హీరోయిన్
on Jun 3, 2015
సినీ పరిశ్రమ ఓ మేడి పండు. అన్నీ పైపై సొబగులే. లోపల మొత్తం పురుగుల పుట్ట. కొంతమంది కథానాయికలు అడ్డదారులు తొక్కుతూ.. సినీ పరిశ్రమకి మరింత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఆ మధ్య ఓ కథానాయిక బ్రోతల్ కేసులో పట్టుబడి.. వార్తలకెక్కింది. ఆ విషయం ఇంకామరుగున పడకముందే మరో కథానాయిక కూడా వ్యభిచారం కేసులో అరెస్టయ్యింది. తెలుగు, హిందీ చిత్రాలతో కాస్త పేరు తెచ్చుకొని, ఇప్పుడు అవకాశాలు లేక అల్లాడుతున్న ఓ కథానాయిక ని వ్యభిచారం కేసుపై గోవా పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆమె పేరు చెప్పడానికి నిరాకరించారు. గోవాలోని ఓ స్టార్ హోటల్‌లో ఈ కథానాయిక వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిపోయింది. అయితే తాను అమాయకురాలినని, తనని అడ్డంగా ఈ కేసులో బుక్ చేశారని ఆమె ఆరోపిస్తోంది. హోటల్ రూమ్ విటుడి పేరుతోనే బుక్ అవ్వడం, ఆ గదిలో లక్షల రూపాయల క్యాష్ దొరకడంతో ఈ కథానాయిక ఈ కేసు నుంచి బయటపడడం కష్టంగానే కనిపిస్తోంది. మరి ఆ కథానాయిక ఎవరనేదే ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. పోలీసులు ఏ పేరు బయటపెడతారో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
