బ్యాంకాక్ వెళ్లేది డ్రగ్స్ కోసమేనా..?
on Jul 19, 2017
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మంది సినీ ప్రముఖులను సిట్ విచారించనుంది. ఇందులో భాగంగా తొలిగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను విచారించనున్నారు. నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్-సెక్షన్ 67 కింద కింది ఈ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో పూరీని సిట్ చీఫ్ వెంకటేశ్వరరావు ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
-కెల్విన్ పరిచయం ఎలా జరిగింది..? ఎవరు పరిచయం చేశారు..?
-కెల్విన్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేశారా..? లేదా..?
-మీరు డ్రగ్స్ వాడుతున్నారా..? వాడితే ఎప్పటి నుంచి ఈ అలవాటు ఉంది..?
-అవసరమైతే బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికి మీరు సిద్ధమేనా..?
-మీ ఇంట్లో జరిగిన డ్రగ్ పార్టీలకు కెల్విన్, జిషన్ వచ్చిన మాట వాస్తవమేనా..?
-మీ ఇంటికి డ్రగ్స్ డోర్ డెలివరీ జరిగిందా..?
-మీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది..? ఎక్కడ భద్రపరుస్తారు..?
-మీరు ఎప్పుడూ బ్యాంకాక్ వెళ్లేది డ్రగ్స్ కోసమేనా..?

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
